బ్నిం



భమిడిపల్లి నరసింహమూర్తి (Bnim, B.N. Murthy), 1957 అక్టోబర్ 28న సూర్యనారాయణ మూర్తి, విజయలక్ష్మి దంపతులకు జన్మించారు. వీరి స్వగ్రామం ఆత్రేయపురం. ఇది ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు, రాజకీయ నాయకులు, ఉద్దండ పండితులు పుట్టినట్టి గ్రామం. వీరి విద్యాభ్యాసం అందరిలా స్కూళ్లలో, కాలేజీల్లో కాకుండా ఇంటి పట్టునే వర్ధిల్లింది. వీరి కుటుంబంలో అందరూ పండితులే! కనుక వారి వద్ద సంప్రదాయ సాహిత్యాధ్యయనం చేశారు. పురాణేతిహాసాలు, కావ్యాలు, ప్రబంధాలు, ఆనువంశికంగా వస్తున్న సాహిత్యాన్ని అభ్యసించారు.
చిన్నప్పట్నించే మాత్రా ఛందస్సులో గీతాలు బుర్రకథలు, రాసిన అనుభవంలో బ్నిం నృత్యరూపకాలు 280కి పైగా వ్రాశారు. వీటిల్లో పౌరాణికాలు, చారిత్రాత్మకాలు, సామాజిక అంశాలు, దేశభక్తి ప్రబోధితాలు, జీవన ఇతివృత్తాలు వున్నాయి. వీటిల్లో బహుళ ప్రాచుర్యం పొందిన పసుమర్తి రామలింగ శాస్త్రి గారి కోసం రాసిన శ్రీరామ కథాసారం, డా.మద్దాలి ఉషా గాయత్రి గారికోసం రాసిన మా తెలుగు తల్లికి మల్లెపూదండ” శ్రీమతి స్వాతీ సోమనాథ్ గారి కోసం రాసిన “వాత్సాయన కామసూత్ర”... ఇంకా దేశ విదేశాల్లో ప్రదర్శించబడిన నృత్యరూపకాలున్నాయి. ఒకే కథాంశాన్ని వివిధ కళా సంస్థలకు రాసినప్పటికీ వాటిల్లో వైవిధ్యాన్ని చూపించటం వీరి ప్రత్యేకత. అందుకే వీరు ‘బ్యాలే బాద్ షా’లా కీర్తించబడ్డారు..

చిననాటి రంగు బొమ్మలు

పత్రికలలో బొమ్మలు చూసి సాధన చేస్తూనే ఆత్రేయపురం హైస్కూల్లో డ్రాయింగ్ మాష్టారు శ్రీ మండపాక సింహాచలం గారి దగ్గర చిత్రలేఖనాభ్యాసం చేశారు.

కార్టూనిస్ట్

పత్రికలలో వీరి కథలు, కార్టూన్లు అచ్చవటంతో పటు ఆత్రేయపురంలో వుండగానే ఎంతో మంది, కవులతోను, కార్టూనిస్టులతో ‘కలం స్నేహం’ చేశారు. ఆ స్నేహమే “స్నేహలత” అనే కళాసాంస్కృతిక సంస్థ రూపకల్పనకు ప్రేరణనిచ్చింది.

రచయిత

పుస్తకరూపంలో వచ్చిన కొన్ని రచనలు:


1)మిసెస్ అండర్ స్టాండింగ్,
2)అనగనగా బ్నిం కథలు
3)అనగనగా మరికొన్ని కథలు
4)అనగనగా మరిన్ని కొత్త కథలు
5)మరపురాని మాణిక్యాలు,
6)చీరపద్యాలు
7)చిల్డ్రన్ అండర్ స్టాండింగ్
8)బ్నిం బ్యాలేలు
9)ఒల్దెర్ అండర్స్టాండింగ్

నాట్యరంగస్థలం

ఒకే కథాంశాన్ని వివిధ కళా సంస్థలకు రాసినప్పటికీ వాటిల్లో వైవిధ్యాన్ని చూపించటం వీరి ప్రత్యేకత. అందుకే వీరు ‘బ్యాలే బాద్ షా’లా కీర్తించబడ్డారు.. చిన్నప్పట్నించే మాత్రా ఛందస్సులో గీతాలు బుర్రకథలు, రాసిన అనుభవంలో బ్నిం నృత్యరూపకాలు 280కి పైగా వ్రాశారు. వీటిల్లో పౌరాణికాలు, చారిత్రాత్మకాలు, సామాజిక అంశాలు, దేశభక్తి ప్రబోధితాలు, జీవన ఇతివృత్తాలు వున్నాయి. వీటిల్లో బహుళ ప్రాచుర్యం పొందిన పసుమర్తి రామలింగ శాస్త్రి గారి కోసం రాసిన శ్రీరామ కథాసారం, డా.మద్దాలి ఉషా గాయత్రి గారికోసం రాసిన మా తెలుగు తల్లికి మల్లెపూదండ” శ్రీమతి స్వాతీ సోమనాథ్ గారి కోసం రాసిన “వాత్సాయన కామసూత్ర”... ఇంకా దేశ విదేశాల్లో ప్రదర్శించబడిన నృత్యరూపకాలున్నాయి.